Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:30 AM

నేలపట్లలో ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం

14-07-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులకు అల్బండజోల్ మాత్రల పంపిణీ

పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం: ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలరాజు

గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో సోమవారం ప్రభుత్వ ఆరోగ్య వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులకు అల్బండజోల్ మాత్రలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలపట్ల ఉపసర్పంచ్, తెలంగాణ ఉపసర్పంచుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చిన్నం బాలరాజు కురుమ హాజరై, విద్యార్థులకు మాత్రలు వేశారు.​ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆరోగ్య సిబ్బంది సూచనల మేరకు 1 సంవత్సరం నుండి 19 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలందరికీ ప్రభుత్వం అందిస్తున్న అల్బండజోల్ మాత్రలను తప్పనిసరిగా వేయించాలని కోరారు.​నిత్యం తినే పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడిగిన తర్వాతే వండుకోవాలి.​భోజనానికి ముందు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.​ప్రతి ఒక్కరూ బాహ్య మలవిసర్జన మానాలి, తప్పకుండా మరుగుదొడ్లను మాత్రమే ఉపయోగించాలి.ఇళ్లలోని చెత్తను రోడ్లపై వేయకుండా, గ్రామపంచాయతీ చెత్త సేకరించే ట్రాక్టరుకే అందించాలి.​ఆరోగ్య సిబ్బంది, ఆశా వర్కర్లు అందించే సూచనలు, జాగ్రత్తలు పాటిస్తూ అందరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని ఆయన పిలుపునిచ్చారు.​ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి స్వరూప, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ఆరోగ్య సిబ్బంది (ఎఎన్ఎమ్) గొల్ల సునంద, ఆశావర్కర్లు బి. విజయ, బి. మీనాక్షి, గ్రామ పంచాయతీ సిబ్బంది జి. భాస్కర్, జి. రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నేలపట్లలో ఘనంగా జాతీయ నులిపురుగుల దినోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News