Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:34 AM

స్నేహానికి 50 ఏళ్లు.. సహచరులతో ఆత్మీయంగా గడిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

12-07-2026 824 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975–76 పదో తరగతి విద్యార్థుల గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం మల్కాపూర్ శివారులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని తన చిన్ననాటి సహచరులు, గురువులతో ఆప్యాయంగా కలుసుకున్నారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత ఒక్కచోట చేరిన మిత్రులు ఒకరినొకరు కౌగిలించుకుని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్ననాటి కష్టాలు, 2009లో తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎదురైన ఇబ్బందులు, అవమానాలను గుర్తు చేసుకున్నారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచానని, ప్రజాప్రతినిధిగా ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పనిచేశానని తెలిపారు. తన రాజకీయ ప్రయాణంలో భార్య సహకారం ఎంతో కీలకమైందని, ఆమె అండతోనే ప్రజాసేవలో ముందుకు సాగగలిగానని చెప్పారు. అలాగే తన సహపాఠుల్లో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు తన వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పూర్వ విద్యార్థులు తమ గురువులను సన్మానించి ఆశీర్వాదాలు తీసుకోగా, అందరూ కలిసి జ్ఞాపికలు పంచుకుని ఫొటోలు దిగుతూ ఈ ఆత్మీయ సమ్మేళనాన్ని చిరస్మరణీయంగా మార్చుకున్నారు.

Sthanikam

స్నేహానికి 50 ఏళ్లు.. సహచరులతో ఆత్మీయంగా గడిపిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News