Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / యాదాద్రి భువనగిరి

వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

Updated : 12 Jul 2026 13:25 IST
As Preferred Source 1 min read
వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

పోలీసులకు సమాచారం.. యుగతులసి గోశాలకు తరలింపు

అక్రమంగా తరలిస్తున్న 24 గోవులను బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వలిగొండ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..ఆదివారం వేకువజామున కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టణ శివార్లలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు.​వాహనంలో ఉన్న 24 గోమాతలను రక్షించి, వెంటనే వలిగొండ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రక్షించిన గోవులను సురక్షితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యుగతులసి ఫౌండేషన్‌ గోశాలకు తరలించారు. గోరక్షణకు సహకరించిన కార్యకర్తలను పలువురు అభినందించారు.

Sthanikam

వలిగొండలో 24 గోవుల రక్షణ- అక్రమ రవాణాను అడ్డుకున్న బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు

Article Image

పోలీసులకు సమాచారం.. యుగతులసి గోశాలకు తరలింపు

అక్రమంగా తరలిస్తున్న 24 గోవులను బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన వలిగొండ పట్టణంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం..ఆదివారం వేకువజామున కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా పశువులను వాహనంలో అక్రమంగా తరలిస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన బజరంగ్‌దళ్‌ కార్యకర్తలు పట్టణ శివార్లలో సదరు వాహనాన్ని అడ్డుకున్నారు.​వాహనంలో ఉన్న 24 గోమాతలను రక్షించి, వెంటనే వలిగొండ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం రక్షించిన గోవులను సురక్షితంగా యాదాద్రి భువనగిరి జిల్లాలోని యుగతులసి ఫౌండేషన్‌ గోశాలకు తరలించారు. గోరక్షణకు సహకరించిన కార్యకర్తలను పలువురు అభినందించారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news