Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఉదరి రాములు కన్నుమూత “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 06:17 PM

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ

30-08-2026 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి

సూర్యాపేటటౌన్‌ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాల పండుగ ప్రతీకగా నిలుస్తోందని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు పోతు భాస్కర్‌ అన్నారు. ఆదివారం సూర్యాపేట పట్టణంలోని తాళ్లగడ్డలో శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారి బోనాల పండుగలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వోత్తమ్‌రెడ్డి మాట్లాడుతూ.. బోనాల పండుగ తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబమన్నారు. తరతరాలుగా కొనసాగుతున్న తెలంగాణ సంస్కృతికి బోనాల పండుగ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందని తెలిపారు. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో కొలవడం తెలంగాణ సంప్రదాయంలో ఎంతో విశిష్టమైనదని పేర్కొన్నారు.

ముత్యాలమ్మ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని, తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరారు. సూర్యాపేట నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలంతా బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని సర్వోత్తమ్‌రెడ్డి కోరారు.

Sthanikam

తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News