Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం

23-08-2026 535 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ‘శ్రీ మహాశాస్త్ర సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం గురు పురస్కార అవార్డు మహోత్సవం వైభవంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు సూదగాని రాజు గురుస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి 'ఉత్తమ గురు పురస్కారం' అందుకున్నారు. ​సాక్షాత్ అయ్యప్ప వంశస్థులు, శబరిమలైకి చెందిన పందల రాజకుటుంబీకులు తిరునాల్ సురేష్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును మురళీ గురుస్వామికి బహుకరించారు. ఆధ్యాత్మిక సేవలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.​ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజు గురుస్వామి, ప్రదీప్ తంత్రి గురుస్వామి, తంగవేలు సంతోష్ గురుస్వామి, భరణి వెంకటేష్ గురుస్వామి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన 118 మంది గురుస్వాములకు ఈ సందర్భంగా గురు పురస్కారాలు, అన్నపూర్ణ అవార్డులను ప్రధానం చేశారు.

Sthanikam

మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News