Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:05 PM

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

12-08-2026 202 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణ పరిధిలో అసంపూర్తిగా ఉన్న ఎన్‌హెచ్‌–161(బి) జాతీయ రహదారి విస్తరణ పనులను వెంటనే చేపట్టాలని జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి మరోసారి రిమైండర్ లేఖ రాశారు. నిజాంపేట్–నారాయణఖేడ్–బీదర్ రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నప్పటికీ, నారాయణఖేడ్ పట్టణ పరిధిలోని 4.50 కి.మీ నుంచి 8.00 కి.మీ వరకు ఉన్న సుమారు 3.50 కి.మీ రహదారి భాగం ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చకపోవడంతో పట్టణంలో తరచూ ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఎంపీ తెలిపారు. రహదారి ఇరుకుగా ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ మిగిలిన రహదారి భాగాన్ని ప్రస్తుత ప్రాజెక్టులో చేర్చి, రహదారి విస్తరణతో పాటు సెంట్రల్ లైటింగ్, ఆధునిక డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ పనులు పూర్తయితే నారాయణఖేడ్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గడంతో పాటు తెలంగాణ–కర్ణాటక మధ్య రవాణా మరింత సులభతరం అవుతుందని తెలిపారు. గతంలో ఇచ్చిన వినతిపై సానుకూలంగా స్పందించి అధికారులను పరిశీలనకు ఆదేశించినందుకు కేంద్ర మంత్రికి ఎంపీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక పరిశీలనను త్వరగా పూర్తి చేసి, పనులకు అవసరమైన నిధులు మంజూరు చేయాలని నితిన్ గడ్కరీని ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ కోరారు.

Sthanikam

నారాయణఖేడ్ రహదారి విస్తరణకు కేంద్రం నుంచి నిధులు కోరిన ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News