Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:19 PM

అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి ​– సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా

12-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు, అర్హులైన వారందరికీ అన్ని రకాల పెన్షన్లను తక్షణమే మంజూరు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎండి పాషా మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో పెన్షన్లను రెట్టింపు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం పేద ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. నిధుల కొరత నెపంతో వృద్ధాప్య పెన్షన్లను నిలిపివేసి, ఇతర పెన్షన్లను మాత్రమే ఇస్తూ ప్రభుత్వం ఇచ్చిన హామీల నుంచి తప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్ అందించకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.​కార్యక్రమంలో సిపిఎం మున్సిపల్ కార్యదర్శి గోశిక కరుణాకర్, నాయకులు బండారు నరసింహ, ఆకుల ధర్మయ్య, గోపగోని లక్ష్మణ్ గౌడ్, బత్తుల శ్రీశైలం గౌడ్, భావన్ల పెళ్లి స్వామి, బత్తుల లక్ష్మయ్య, సప్పిడి శ్రీనివాసరెడ్డి, సిల్వేరు జంగయ్య, మగుదల రాములు, బాబు, బిక్షపతి, తోర్పునూరి మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అర్హులైన వారందరికీ పెన్షన్లు ఇవ్వాలి ​– సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎండి పాషా

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News