ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఘాతుకం.. నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మృతి.
కొండమల్లేపల్లి: నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలంలోని జేబీ కాలనీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కొండమల్లేపల్లికి చెందిన రూపారెడ్డి (45) మృతిచెందారు. ఆమె స్థానిక నాగార్జున పబ్లిక్ స్కూల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.
రాత్రి సమయంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆమెపై దాడి చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉన్న ఆమె భర్త ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వ్యక్తమైంది. దీంతో ఇంట్లో అద్దెకు ఉంటున్న వారిని సంప్రదించగా ఘటన వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
విషయం తెలియగానే పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తలుపులు తెరిచి పరిశీలించగా రూపారెడ్డి మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పాత కక్షలు, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లోనూ విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. సంఘటనా స్థలంలో ఆధారాలను సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి