Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 08:13 AM

నల్లగొండలో కలకలం ఐకాన్ ఆసుపత్రిపై డీఎంహెచ్ఓ ఆకస్మిక దాడి...

11-08-2026 222 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

మూడేళ్లలో 191 మంది మృతి కేస్ షీట్ , రికార్డులు స్వాధీనం...

వైద్యుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి...

అధిక బిల్లులు, వైద్యుల అర్హతలపై లోతైన విచారణ...

నల్లగొండ : పట్టణంలోని ప్రముఖ ఐకాన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌పై మంగళవారం రాత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్ఓ) డాక్టర్ కె.రాహుల్ నేతృత్వంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆసుపత్రి యాజమాన్యంపై వరుసగా వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ దాడి జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గడిచిన మూడేళ్ల కాలంలో ఈ ఆసుపత్రిలో ఏకంగా 191 మంది రోగులు మరణించినట్లు రికార్డుల్లో తేలడం గమనార్హం. మరణాలకు సంబంధించి పూర్తి కేస్‌షీట్లను, బిల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

వైద్యుల నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనలపై దృష్టి

మరణించిన 191 మందికి సంబంధించి అందించిన చికిత్స వివరాలు, వైద్యుల నిర్లక్ష్యం ఉందా లేదా అనే కోణంలో అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. హైదరాబాద్ స్థాయిలో ఆసుపత్రి యాజమాన్యం విపరీతంగా బిల్లులు వసూలు చేస్తోందని, దీంతో పలువురు బాధితులు ఆసుపత్రి తీరుపై డీఎంహెచ్ఓకు పిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేసిన కొన్ని సేకరించిన బిల్లుల శాంపిళ్లను అధికారులు పరిశీలన నిమిత్తం స్వాధీనం చేసుకున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రికి రోగుల తరలింపుపై ఆరా..

అధిక బిల్లులు చెల్లించలేని స్థితిలో ఉన్న బాధితులను ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి పంపుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. రోజుకు కనీసం 5 నుంచి 6 బెడ్లు ఈ ఆసుపత్రి నుంచి పంపించిన రోగులతోనే నిండుతున్నాయని తెలియడంతో అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి వివరాలు సేకరించారు.

అర్హత లేని వైద్యులతో ప్రాక్టీస్?

ఆసుపత్రి ప్రారంభంలో అనుమతుల కోసం చూపించిన వైద్యులు ప్రస్తుతం అక్కడ లేరని తనిఖీల్లో వెల్లడైంది. ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు అర్హత లేని వైద్యులు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనే సమాచారంతో, ప్రస్తుతం పనిచేస్తున్న వారి విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ వివరాలు, విజిటింగ్ వైద్యుల రికార్డులను అధికారులు సేకరించారు.

తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాం డీఎంహెచ్ఓ రాహుల్..
"ప్రైవేట్ ఆసుపత్రులు క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం అన్ని నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి. స్వాధీనం చేసుకున్న రికార్డులు, కేస్‌షీట్లు, బిల్లులను ల్యాబ్, టెక్నికల్ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఉల్లంఘనలు లేదా వైద్యుల నిర్లక్ష్యం రుజువైతే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం."

Sthanikam

నల్లగొండలో కలకలం ఐకాన్ ఆసుపత్రిపై డీఎంహెచ్ఓ ఆకస్మిక దాడి...

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News