Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:02 PM

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కృషి

11-08-2026 79 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో జీవిస్తూ స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా స్వావలంబన సాధించేలా సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంయుక్తంగా కృషి చేస్తున్నాయని ఫౌండేషన్ టెరిటరీ మేనేజర్ రవిప్రకాష్ తెలిపారు. కంది మండలానికి చెందిన దివ్యాంగులకు సంగారెడ్డిలో స్వయం ఉపాధి అవకాశాలు, వ్యాపార నిర్వహణ, ఆర్థిక ప్రణాళిక, మార్కెటింగ్ పద్ధతులు, చిన్న వ్యాపారాల అభివృద్ధిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు తమ నైపుణ్యాలను పెంపొందించుకొని స్వంతంగా వ్యాపారాలు ప్రారంభించి ఆర్థికంగా ఎదగాలని నిర్వాహకులు సూచించారు.ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన కల్పించారు. అనంతరం డీఆర్‌డీఏ కంది మండల సమాఖ్య ఏపీఎం శివలక్ష్మి దివ్యాంగుల అభివృద్ధికి సంస్థ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. అనంతరం దివ్యాంగులకు స్వయం ఉపాధి కోసం గ్రాంట్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొని కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ సంగారెడ్డి జిల్లా క్లస్టర్ కోఆర్డినేటర్లు జె. శ్రీకాంత్, ప్రశాంత్, మండల మహిళా సమాఖ్య అధ్యక్షురాలు అనిత, క్లస్టర్ కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

Sthanikam

దివ్యాంగుల ఆర్థికాభివృద్ధికి సెర్ప్, డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ కృషి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News