Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:16 PM

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

11-08-2026 53 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు

గర్భధారణ సమయంలో మహిళలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సరైన పోషకాహారంతో పాటు వైద్యుల సలహాలు తప్పనిసరిగా పాటించాలని ప్రముఖ వైద్యులు సూచించారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీలోని కళాశ్రీ ఫంక్షన్ హాల్‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ చౌటుప్పల్ సేవ ఆధ్వర్యంలో గర్భిణులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.​ లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎండి అత్ హర్ పాషా అధ్యక్షత వహించగా.. చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దాచేపల్లి ప్రకాష్ గుప్తా, రీజియన్ చైర్‌పర్సన్ సంజీవరెడ్డి, జోన్ చైర్మన్ ఉప్పు ఆంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.​సదస్సులో వైద్యులు డాక్టర్ వై. సూర్యశ్రీ, డాక్టర్ ప్రశాంతి రెడ్డి, డాక్టర్ అవ్వరు శ్రీనివాస్ ప్రసాద్ మాట్లాడుతూ.. గర్భిణులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం మాత్రలు వాడాలని సూచించారు. పరిశుభ్రమైన నీరు, తగినంత విశ్రాంతి తల్లి-బిడ్డల ఆరోగ్యానికి ఎంతో అవసరమని తెలిపారు. అధిక రక్తపోటు, తీవ్రమైన తలనొప్పి, కాళ్ల వాపులు లేదా బిడ్డ కదలికలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని హెచ్చరించారు. సురక్షిత ప్రసవం కోసం కుటుంబ సభ్యుల సహకారం చాలా కీలకమని పేర్కొన్నారు.

కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి దాచేపల్లి రాజు గుప్తా, కోశాధికారి బత్తిని రఘు, నాంపల్లి రమేష్ గుప్తా, తిరందాసు జగన్ నాథ్, కాసుల వెంకటేశం గౌడ్, కామిశెట్టి చంద్రశేఖర్ గుప్తా, గొప గోని లక్ష్మణ్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, సిలివేరు మంగయ్య, వనం రాజు, సంపూర్ణ చారి, పోలోజు రాజు, పోలోజు శ్రీనివాస చారి, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News