Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:15 PM

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ఎం.డి. జహంగీర్

10-08-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కార్పొరేట్లకు లబ్ధి చేకూరుస్తూ, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.డి. జహంగీర్ విమర్శించారు. చౌటుప్పల్‌లో సీఐటీయూ, రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జైల్ భరో’ నిరసన ర్యాలీ, ధర్నాలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 4 లేబర్ కోడ్‌ల అమలుతో కార్మికుల హక్కులను కాలరాస్తూ, రోజువారీ పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచేందుకు కుట్ర పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన కోడ్‌ల వల్ల భవన నిర్మాణం, హమాలీ, రవాణా, బీడీ కార్మికుల సంక్షేమం దెబ్బతింటుందన్నారు.

విద్యుత్ సవరణ బిల్లు, విత్తన చట్టాల సవరణలతో రైతులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ​ఈ 4 లేబర్ కోడ్‌లను రద్దు చేసేంత వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బూరుగు కృష్ణారెడ్డి, సిఐటియు జిల్లా కోశాధికారి ఎండి పాషా, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గంగాదేవి సైదులు, కార్మిక సంఘాల నాయకులు చిర్కఅలివేలు, గోశిక కరుణాకర్, చీర్క సంజీవరెడ్డి, ఆదిమూల నందీశ్వర్, చీమ కళ్ళ శ్రీరాములు, జొన్న కంటి దేవయ్య, చింతల సుదర్శన్, ఆకుల ధర్మయ్య, బాతరాజు దశరథ, యాట బాలరాజు, కొంతం శ్రీనివాస్ రెడ్డి, చెరుకు లక్ష్మమ్మ, జక్కిడి అంజిరెడ్డి, యాట వెంకటేశం, తోర్పునూరి మల్లేశ, కొండ శ్రీశైలం, మీసాల శ్రీను, యాదయ్య, మల్లమ్మ, జ్యోతి, నరసింహ, సప్పిడి శ్రీనివాస్ రెడ్డి, మాండ్ర కోటయ్య పాల్గొన్నారు.

Sthanikam

కార్మిక వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి: ఎం.డి. జహంగీర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News