Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

రామన్నపేటలో జైలు భరో.. రాస్తారోకో రైతు, కార్మిక సంఘాల నాయకుల అరెస్ట్.

10-08-2026 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 10: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం రామన్నపేట మండల కేంద్రంలో జైలు భరో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, రైతుల రుణభారం తగ్గించి సమగ్ర మద్దతు అందించాలని నాయకులు డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మికులకు ఏడాది పొడవునా ఉపాధి కల్పించేలా ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయడంతో పాటు పని దినాలు, కూలి రేట్లు పెంచాలని కోరారు. కార్మికులకు కనీస వేతనాలు, ఉద్యోగ, సామాజిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు మేక అశోక్‌రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జల్లెల పెంటయ్య, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గొరిగే సోములు మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను రూపొందిస్తోందని ఆరోపించారు. ప్రజా సమస్యలపై పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులు, కార్మికులు ఐక్యంగా పోరాడి ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.

రాస్తారోకో చేస్తున్న నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి రామన్నపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టులను నాయకులు తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో గన్నేబోయిన విజయభాస్కర్, బోయిని ఆనంద్, కందుల హనుమతు, నకిరకంటి రాము, కల్లూరి నగేష్, మేడబోయిన శ్రీనివాస్, అవనగంటి నగేష్, బావండ్లపల్లి బాలరాజు, మునికుంట్ల లెనిన్, మేడి గణేష్, అప్పం సురేందర్, తాళ్లపల్లి జితేందర్, నాగటి లక్ష్మణ్, శానగొండ వెంకటేశ్వర్లు, బందెల బిక్షం, బుడ్డ ప్రసాద్, పల్లె సత్యం తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో జైలు భరో.. రాస్తారోకో రైతు, కార్మిక సంఘాల నాయకుల అరెస్ట్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News