Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:04 PM

రాష్ట్ర సుభిక్షం కోసం నాగార్జునసాగర్‌లో మహా వరుణయాగం. విస్తారంగా వర్షాలు కురవాలని సీఎం రేవంత్‌రెడ్డి దంపతుల పూర్ణాహుతి.

10-08-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జునసాగర్, ఆగస్టు 10: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, తెలంగాణ సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున మహా వరుణయాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దంపతులు రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వైదిక సంప్రదాయ పద్ధతిలో వరుణయాగం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య భక్తిశ్రద్ధలతో యాగ కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు.

నదులు, ప్రాజెక్టులు నిండాలని ప్రార్థన

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి వరుణదేవుడిని ప్రార్థించారు. ప్రతి చెరువు, కుంట నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండుతూ రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కే. జానారెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

రాష్ట్ర సుభిక్షం కోసం నాగార్జునసాగర్‌లో మహా వరుణయాగం. విస్తారంగా వర్షాలు కురవాలని సీఎం రేవంత్‌రెడ్డి దంపతుల పూర్ణాహుతి.

Article Image

నాగార్జునసాగర్, ఆగస్టు 10: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి, తెలంగాణ సస్యశ్యామలంగా, సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నాగార్జునసాగర్‌లోని విజయ్ విహార్ వద్ద కృష్ణా నది ఒడ్డున మహా వరుణయాగం నిర్వహించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి దంపతులు రుత్వికుల మార్గదర్శకత్వంలో యాగక్రతువులను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు.

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో వైదిక సంప్రదాయ పద్ధతిలో వరుణయాగం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, వైదిక క్రతువుల మధ్య భక్తిశ్రద్ధలతో యాగ కార్యక్రమం కొనసాగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు కూడా యాగంలో పాల్గొన్నారు.

నదులు, ప్రాజెక్టులు నిండాలని ప్రార్థన

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు నిండుగా ప్రవహించాలని, శ్రీశైలం, నాగార్జునసాగర్ సహా అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి వరుణదేవుడిని ప్రార్థించారు. ప్రతి చెరువు, కుంట నిండాలని, భూగర్భ జలాలు పెరగాలని, పంటలు పుష్కలంగా పండుతూ రైతుల ముఖాల్లో చిరునవ్వులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, పి. సుదర్శన్‌రెడ్డి, మాజీ మంత్రి కే. జానారెడ్డి, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జయవీర్‌రెడ్డితో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News