Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో

Updated : 10 Aug 2026 19:50 IST
As Preferred Source 1 min read
నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో

దేశవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల ఆధ్వర్యంలో నాగల్‌గిద్ద మండల కేంద్రంలో జైల్‌భరో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయగా, పోలీసులు నిరసనలో పాల్గొన్న నాయకులను అరెస్టు చేశారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు కొఠారి నర్సింలు, సీఐటీయూ మండల నాయకులు గణపతి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా మార్చడం కార్మికుల హక్కులకు విరుద్ధమని అన్నారు.పెరుగుతున్న గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేసి కూలీలకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న నాయకులను అరెస్టు చేయడం సరికాదని, అక్రమ అరెస్టులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు నిర్మలా, సంగీత, సవిత, సురేఖ, జ్యోతి, అల్‌వేణి, విద్యావతి, రుక్మిణి, తూకారం, సాయి, దాస్, రాజు, రాములు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగల్‌గిద్దలో ప్రజా సమస్యలపై కార్మిక, రైతు సంఘాల జైల్‌భరో

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news