Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 10, 2026 03:24 PM

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం

10-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కోసం ఏర్పాటు చేసిన గద్దెను కూల్చివేయడం దుర్మార్గమైన చర్య అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గద్దె కూల్చిన ప్రదేశాన్ని ఆయన సందర్శించి మాట్లాడారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గద్దెను కూల్చివేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన వెనుక కాంగ్రెస్‌ నాయకుల ప్రమేయం ఉందనే అనుమానాలు ఉన్నాయని, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి తీరుతామని స్పష్టం చేశారు. నర్సంపేటలో ఇప్పటికే ఏర్పాటు చేసిన ఇతర విగ్రహాలకు అనుమతులు ఉన్నాయా? అనే అంశంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. ప్రస్తుతం దశదిన కార్యక్రమం ఉన్నందున తాత్కాలికంగా ధర్నా విరమిస్తున్నట్లు తెలిపారు. రెండు రోజుల్లోగా బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే ఉమ్మడి వరంగల్‌ జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించారు.

Sthanikam

పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత దుర్మార్గం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News