Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:30 AM

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం
09-08-2026 128 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

కూసుమంచి గ్రామాల్లో నేరాల నియంత్రణకు, ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఏసీపీ తిరుపతిరావు అన్నారు. కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ.. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. గ్రామంలో అసాంఘిక కార్యకలాపాలు, దొంగతనాలు జరగకుండా అడ్డుకోవడంతో పాటు, నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు. గ్రామ ప్రజలు భద్రత విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను ఏసీపీ తిరుపతిరావు సన్మానించారు. కార్యక్రమంలో సీఐ సందీప్, ఎస్సై నాగరాజు, సర్పంచ్ సరిత–లింగయ్య, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రామాభివృద్ధికి సీసీ కెమెరాలు దోహదం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News