Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గిరిజన గురుకుల పాఠశాలలో 4 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ.. అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 09, 2026 09:14 PM

వృద్ధులకు పెద్ద కొడుకు.. అన్నార్తులకు అన్నదాత. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్‌తో పెద్ది శంకర్ గౌడ్ సేవలు.

09-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వనస్థలిపురం: చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయిన పెద్ది శంకర్ గౌడ్.. నేడు అనాథలు, వృద్ధులకు ఆపద్బాంధవుడిగా మారారు. కన్నబిడ్డలు పట్టించుకోని వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వారి బాగోగులు చూసుకుంటున్నారు. ‘రెడీ టూ సర్వ్ ఫౌండేషన్’ ద్వారా ఉచిత వృద్ధాశ్రమాన్ని నిర్వహిస్తూ పెద్ద కొడుకుగా అండగా నిలుస్తున్నారు.

15 ఏళ్లుగా సేవా బాటలో..

ఆస్పత్రుల్లో చికిత్స కోసం వచ్చే పేద రోగులు, అన్నార్తులకు ప్రతి ఆదివారం అన్నదానం చేస్తున్నారు. తొలుత 50 మందితో ప్రారంభమైన ఈ సేవ ప్రస్తుతం 200–300 మందికి చేరింది. వనస్థలిపురం, గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఎంఎన్‌జే, బసవతారకం తదితర ఆస్పత్రుల వద్ద అన్నదానం కొనసాగుతోంది. వృద్ధాశ్రమంలో వసతి సరిపోక ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి ఆశ్రమ నిర్మాణానికి స్థలం కోసం శంకర్ గౌడ్ దాతల సహకారం కోరుతున్నారు. ఒక్క చదరపు అడుగుకు రూ.3,500 చొప్పున సాయం చేయాలని, 9701295527 నంబర్‌లో సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

పావలా శ్యామలకు అండగా..

అనారోగ్యంతో బాధపడిన సీనియర్ నటి పావలా శ్యామలకు తన ఆశ్రమంలో ఆశ్రయం కల్పించిన శంకర్ గౌడ్.. ఆమె కుమార్తె మాధవికి కూడా అండగా నిలిచారు. ‘గేమ్‌ ఛేంజర్’ సినిమాలో ఆశ్రమంలోని వృద్ధులకు నటించే అవకాశం లభించడంతో పాటు సినిమా బృందం విరాళం అందించింది. మెగాస్టార్ చిరంజీవి రూ.లక్ష, గీతా భాస్కర్ రూ.50 వేల సాయం చేశారు. ఆగస్టు 10న శంకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా ఆయన సేవలను అభినందిస్తూ ఆశీర్వదిద్దాం.

Sthanikam

వృద్ధులకు పెద్ద కొడుకు.. అన్నార్తులకు అన్నదాత. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్‌తో పెద్ది శంకర్ గౌడ్ సేవలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News