Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గడువులోగా ఎస్‌ఐఆర్‌ పూర్తి చేయాలని.. అదనపు సమయం పనిచేసిన రెవెన్యూ సిబ్బంది దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:29 AM

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత
09-08-2026 169 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పేదరికం ఉన్నత చదువులకు అడ్డుకాకూడదనే ఉద్దేశంతో విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి శ్రీకాకోళ్లపు చలపతిరావు తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి సదన్‌ అపార్ట్‌మెంట్‌లో శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షుడు బచ్చు పురుషోత్తం ఆధ్వర్యంలో ముగ్గురు పేద ఆర్యవైశ్య విద్యార్థులకు చలపతిరావు, సులోచన దంపతులు రూ.30 వేల ఆర్థిక సాయం అందించారు.

ఈ సందర్భంగా చలపతిరావు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాలకు ఎదిగి తల్లిదండ్రుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ సేవా గుణాన్ని అలవర్చుకోవాలని సూచించారు.

బీటెక్‌ మొదటి సంవత్సరం చదువుతున్న బుస్సా జ్ఞానసాయికి రూ.15 వేలు, ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న వీర్లపాటి జయశ్రీకి రూ.10 వేలు, రాచూరి సహస్రకు రూ.5 వేలు అందించారు. కార్యక్రమంలో శ్రీకాకోళ్లపు రాఘవేంద్ర, భవాని, సింగిరికొండ సుకుమార్, శ్రీ వాసవి సేవా సమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు, వెంకటరమణ, విద్యార్థుల కుటుంబ సభ్యులు బుస్సా వీరకుమార్, రాచూరి పూర్ణచందర్, వీర్లపాటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పేద విద్యార్థులకు ఆర్థిక చేయూత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News