కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చకీలం రాజేశ్వరరావు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరి కుంట్ల వేణుగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలిమినేటి అభినయ్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్ ద్వారా ఎంతోమంది యువకులు రాజకీయాల్లోకి వచ్చి పార్టీకి సేవలందించారని తెలిపారు. యువజన కాంగ్రెస్‌లో పదవులు పొందిన నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.
రానున్న రోజుల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి విజయానికి యువజన కాంగ్రెస్ తరఫున ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. 2028–29లో తెలంగాణలో మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డిని భవిష్యత్‌లో ఎమ్మెల్యేగా చూడాలనే లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని పేర్కొన్నారు.యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐలో పనిచేసే కార్యకర్తలకు పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని అన్నారు. దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి నాయకత్వంలో పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. భవిష్యత్‌లోనూ యువతకు ప్రాధాన్యం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కౌన్సిలర్లు నాగుల వాసు, బానోత్ సైదులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చింతమల్ల రమేష్, జానయ్య, నరేందర్ నాయుడు, సాయి నేత, నారాయణ, దివ్య, మాధవరెడ్డి, సమీర్, అనిల్, నరేష్, శివ, మధు, శివమణి, సుధీర్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.














































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి