తుంగతుర్తి;ఎల్‌నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక చెరువులు, కుంటలు నిండక రైతాంగం పంటలను ఎలా కాపాడుకోవాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉందని బీఆర్ఎస్ తుంగతుర్తి మండల అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ తాటికొండ సీతయ్య అన్నారు.వరదలతో గోదావరి నది నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తున్న సమయంలో ఆ నీటిని రైతుల పంటలకు అందించాలని కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రైతులకు గోదావరి జలాలు అందించాలి
వర్షాభావ పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సాగు చేసిన పంటలను కాపాడుకోవడానికి సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని సీతయ్య పేర్కొన్నారు. గోదావరిలో వరద నీరు ప్రవహిస్తున్నప్పటికీ రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వరుణ యాగాలు నిర్వహించడం కంటే రైతుల పంటలను కాపాడేందుకు గోదావరి జలాలను అందించడం ముఖ్యమని అన్నారు.
ముందస్తు అరెస్టులు తీవ్రంగా ఖండిస్తున్నాం
వరుణ యాగాన్ని అడ్డుకుంటారనే భయంతో బీఆర్ఎస్ నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని తాటికొండ సీతయ్య విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే వారిని అరెస్టు చేయడం సరికాదన్నారు.రైతులకు సాగునీరు అందించాలని కోరుతున్న తమపై అక్రమంగా ముందస్తు చర్యలు తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
ముందస్తు అరెస్టయిన వారిలో తాటికొండ సీతయ్య, గ్రామ నాయకులు బైరోజు దేవేంద్రచారి, కొల్లూరి లింగయ్య, కోరుకొప్పుల వెంకన్న ఉన్నారని తెలిపారు.రైతుల ప్రయోజనాల కోసం తమ పోరాటం కొనసాగుతుందని సీతయ్య స్పష్టం చేశారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి