సూర్యాపేటకు రైల్వే మార్గం ఏర్పాటు చేయడం జిల్లా ప్రజల చిరకాల కోరిక అని, అది సాకారమయ్యే వరకు శాంతియుతంగా పోరాటాలు కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నాయకుడు బండారు రాజా తెలిపారు. సూర్యాపేటకు మొదట కేటాయించిన బుల్లెట్ రైలు అలైన్‌మెంట్‌ను పునరుద్ధరించాలని కోరుతూ ఉద్యమిస్తున్న రైల్వే సాధన సమితి నాయకులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
రైల్వే కోసం పోరాడుతున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం సరికాదన్నారు. శంషాబాద్ నుంచి సూర్యాపేట, అమరావతి మీదుగా చెన్నైకి వెళ్లాల్సిన రైలు మార్గాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట మీదుగా రైల్వే మార్గం ఏర్పాటైతే ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. నాయకులను అరెస్టు చేసినంత మాత్రాన రైల్వే సాధన ఉద్యమాన్ని ఆపలేరని, రైల్వే సాధన సమితి చేస్తున్న ఉద్యమానికి ఆర్యవైశ్యుల సంపూర్ణ మద్దతు ఉంటుందని బండారు రాజా తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి