Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:31 PM

అసైన్డ్‌ భూమికి రక్షణేదీ?

అసైన్డ్‌ భూమికి రక్షణేదీ?

అసైన్డ్‌ భూమికి రక్షణేదీ?
11-08-2026 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

రాతికడీలు, కంచె ధ్వంసంపై కేసు నమోదు చేయాలి.

పీఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో చిట్యాలలో ధర్నా.

చిట్యాల: జోగు పార్వతమ్మకు చెందిన అసైన్డ్‌ భూమిలో రాతికడీలు, కంచెను జేసీబీతో ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేసి బాధితురాలికి న్యాయం చేయాలని ప్రజా పోరాట సమితి (పీఆర్‌పీఎస్‌) రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్‌స్వామి డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే వేముల వీరేశం అండతో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ భర్త దేశపాక రాజేష్‌ అరాచకానికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

చిట్యాల మున్సిపల్‌ కార్యాలయం, తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట మంగళవారం పీఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు మెమొరాండాలు అందజేశారు. ఈ సందర్భంగా వెంకట్‌స్వామి మాట్లాడుతూ.. జోగు పార్వతమ్మకు చెందిన ఎకరం అసైన్డ్‌ భూమిలో ఉన్న రాతికడీలు, కంచెను రాత్రికి రాత్రే జేసీబీతో కూల్చివేశారని, దీంతో సుమారు రూ.4 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని తెలిపారు.ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా రెండు నెలలుగా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. రాతికడీలు తామే కూల్చినట్లు కౌన్సిలర్‌ కుటుంబ సభ్యులు పోలీసుల ఎదుట చెప్పినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. అధికార పార్టీకి చెందినవారికి ఒక న్యాయం, సాధారణ ప్రజలకు మరో న్యాయం ఉండకూడదని పేర్కొన్నారు..అసైన్డ్‌ భూమిని కాపాడటంతో పాటు బాధ్యులపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలని రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులను డిమాండ్‌ చేశారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని వెంకట్‌స్వామి తెలిపారు.

ధర్నాలో పీఆర్‌పీఎస్‌ జిల్లా నాయకులు ఉయ్యాల లింగస్వామిగౌడ్‌, ఏర్పుల లింగస్వామి యాదవ్‌, మారగోని వెంకన్నగౌడ్‌, బర్రె సంజీవ, గాదె శ్రీహరి, జోగు శేఖర్‌, జోగు పార్వతమ్మ, మహంకాళి రమాదేవి, జిట్టా మీనమ్మ, జిట్ట శ్రీకాంత్‌, మేడి ప్రసాద్‌, దొండ నరసింహ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అసైన్డ్‌ భూమికి రక్షణేదీ?

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News