Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:34 PM

రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం

11-08-2026 64 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నార్కట్‌పల్లిలో బీజేపీ ఆమరణ నిరాహార దీక్షకు బ్రేక్‌.. ఉద్రిక్తత.

నార్కట్‌పల్లి: రోడ్డు విస్తరణ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ నార్కట్‌పల్లి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం భగ్నం చేశారు. రోడ్డు విస్తరణ పనులు నత్తనడకన సాగుతుండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీజేపీ నాయకులు ఆరోపించారు.

దీక్ష కొనసాగుతున్న సమయంలో పోలీసులు దీక్షా శిబిరం వద్దకు చేరుకున్నారు. దీక్షలో కూర్చున్న బీజేపీ నాయకులు, కార్యకర్తలను అక్కడి నుంచి తరలించారు. దీంతో కొద్దిసేపు దీక్షా ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పోరాటం ఆగదు.

ప్రజల సమస్య పరిష్కారం కోసం శాంతియుతంగా చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడం సరికాదని బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డు విస్తరణ పనులు పూర్తయ్యే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నా అధికారులు స్పందించకపోవడం బాధాకరమని వారు పేర్కొన్నారు.

Sthanikam

రోడ్డు విస్తరణ కోసం దీక్ష.. పోలీసుల భగ్నం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News