Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:12 PM

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన
11-08-2026 90 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

విద్యార్థులకు దుస్తుల పంపిణీ.. ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన

మండల పరిధిలోని పంతంగి గ్రామంలో జిల్లా పరిషత్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (జడ్పీ సీఈఓ) శోభారాణి మంగళవారం విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి, విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత స్కూల్ యూనిఫారమ్ పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. ​పాఠశాల పర్యటన అనంతరం గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను సీఈఓ పరిశీలించారు. పూర్తయిన గృహాలను పరిశీలించడంతో పాటు, ఇంకా నిర్మాణంలో ఉన్న పెండింగ్ ఇండ్ల వివరాలను సంబంధిత హౌసింగ్ ఏఈని అడిగి తెలుసుకున్నారు. పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని అధికారులను ఆదేశించారు.​ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) శ్రీలత, గ్రామ సర్పంచ్ శ్రీలత సుందర్, పంచాయతీ కార్యదర్శి పద్మజ, హౌసింగ్ ఏఈ పవన్ కళ్యాణ్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, ఉపాధ్యాయులు,విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

పంతంగిలో జడ్పీ సీఈఓ శోభారాణి పర్యటన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News