మహారాష్ట్రలోని పవిత్రమైన పోహరాఘడ్ మరెమ్మ యాడి దేవాలయం, సేవాలాల్ మహారాజ్ మఠంలో బంజారా సేవా దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఏర్పాటు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బంజారా సేవా దళ్ వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్, పోహరాఘడ్ పీఠాధిపతి శేఖర్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు రామ్‌చందర్ నాయక్ తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి సుమారు 150 మంది బంజారా సేవా దళ్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అశోక్ రాథోడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన నాయకులకు పీఠాధిపతి శేఖర్ మహారాజ్ కండువాలు కప్పి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నాయకులు మరెమ్మ యాడి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంజారా సమాజ ఐక్యత, హక్కులు, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం బంజారా సేవా దళ్ నిరంతరం కృషి చేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు నేనావత్ అజయ్ నాయక్ తెలిపారు. తెలంగాణలోని మైదాన ప్రాంత గిరిజనులకు ఎలాంటి అన్యాయం జరిగినా వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన రాష్ట్ర అధ్యక్షుడు రఘురాం రాథోడ్ పేర్కొన్నారు.
బంజారా సేవా దళ్‌కు నూతన రాష్ట్ర కమిటీ.. అధ్యక్షుడిగా రఘురాం రాథోడ్

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి