Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

భూగర్భ జల సంరక్షణకే ‘జలసిరి’ : సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

11-08-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ధర్మోజిగూడెంలో ఇంకుడు గుంతల నిర్మాణానికి శంకుస్థాపన

భూగర్భ జల సంరక్షణ కోసమే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జలసిరి’ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఇంకుడు గుంతల నిర్మాణం చేపడుతున్నామని ధర్మోజిగూడెం సర్పంచ్ జువ్వి నర్సింహ్మ తెలిపారు. చౌటుప్పల్ మండలం ధర్మోజిగూడెం గ్రామంలో బుధవారం ప్రారంభమైన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని ఇంకుడు గుంత నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... వర్షపు నీరు వృథాగా పోకుండా నిల్వ చేసేందుకు, భూగర్భ నీటి మట్టాలను పెంపొందించేందుకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయన్నారు. గ్రామాల్లో నీటి కొరత తీరాలంటే భూగర్భ జలాలు పెరగాలని, అది ఒక్క ఇంకుడు గుంతలతోనే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. గ్రామంలోని ప్రజలందరూ ముందుకు వచ్చి సాధ్యమైనంత వరకు ఇంకుడు గుంతలను నిర్మించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సామిడి సంధ్య, ఐతరాజు శారద, రాచకొండ భార్గవ్, జీడిముడ్ల శోభ, గునుగంటి వెంకటేశం, పంచాయతీ కార్యదర్శి సుధాకర్, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

భూగర్భ జల సంరక్షణకే ‘జలసిరి’ : సర్పంచ్ జువ్వి నర్సింహ్మ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News