Sthanikam - Truth Matters
Logo
Home / ప్రాంతీయ వార్తలు / నారాయణఖేడ్

నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Updated : 11 Aug 2026 20:10 IST
As Preferred Source 1 min read
నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సెక్రటేరియట్‌లో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొని నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు, నీటిపారుదల వసతులు, పెండింగ్ పనులపై చర్చించారు. ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందేలా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు నియోజకవర్గంలోని సమస్యలు, ప్రాజెక్టుల పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వివరాలు అందించారు. నారాయణఖేడ్ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన నీటి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు.

Sthanikam

నారాయణఖేడ్‌కు నీటి వసతులే ప్రథమ ప్రాధాన్యం: ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సాగునీరు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సెక్రటేరియట్‌లో కీలక సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవరెడ్డి పాల్గొని నియోజకవర్గంలోని సాగునీటి ప్రాజెక్టులు, తాగునీటి సమస్యలు, నీటిపారుదల వసతులు, పెండింగ్ పనులపై చర్చించారు. ప్రతి గ్రామానికి సాగు, తాగునీరు అందేలా ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు నియోజకవర్గంలోని సమస్యలు, ప్రాజెక్టుల పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వివరాలు అందించారు. నారాయణఖేడ్ అభివృద్ధితో పాటు ప్రజలకు మెరుగైన నీటి సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు తెలిపారు.

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news