యాదాద్రి భువనగిరి: జిల్లా ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఐపీఎస్‌ను తెలంగాణ పొలిటికల్ యువజన సమితి (టీపీవైఎస్) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు ఎస్పీని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా టీపీవైఎస్ వ్యవస్థాపక, రాష్ట్ర అధ్యక్షుడు ఇంజమూరి రామన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగపాక నవీన్ బిల్లా తదితరులు ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో యువతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు నాయకులు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, కోఆర్డినేటర్ మహాకాళి సురేష్‌చారి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్ కుమార్, జక్కల మత్స్యగిరి, చోల్లేటి శ్రీనివాసచారి, మోటకొండూరు అశోక్‌చారి తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి