Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:18 PM

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​

12-08-2026 41 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

*లింగోజిగూడెం 'సవారియా' కంపెనీలో సైబర్ అవగాహన సదస్సు

సమాజంలో రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని చౌటుప్పల్ సీఐ జి. మన్మథ కుమార్ సూచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని లింగోజిగూడెం గ్రామంలో గల 'సవారియా' కంపెనీలో సైబర్ భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన సీఐ మాట్లాడుతూ.. మోసగాళ్ల వలలో పడి నిలువునా మునిగిపోవద్దని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP), పిన్, సీవీవీ, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ వివరాలు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడదు. ఆన్‌లైన్ పెట్టుబడులు, పార్ట్‌టైమ్ ఉద్యోగాలు, రివార్డులు, తక్కువ వడ్డీకే లోన్ల పేరిట వచ్చే అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దు. యుపిఐ (UPI) ద్వారా నగదు బదిలీ చేసేముందు వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.

​ఆలస్యం చేయకుండా 1930కి ఫిర్యాదు చేయండి

ఒకవేళ సైబర్ మోసానికి గురైతే లేదా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గమనిస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబరుకు బాధితులు సమాచారం అందించాలని సీఐ తెలిపారు. ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సైబర్ భద్రతపై ప్రతి ఒక్కరినీ చైతన్యపరచాలని కోరారు.

Sthanikam

ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ మన్మథ కుమార్ ​

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News