Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 12:33 PM

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

12-08-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

సీఎంఆర్‌ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణలపై ఆరా.. పాత రికార్డుల పరిశీలన.

రామన్నపేట: మండలంలోని తుమ్మలగూడెం (ఇంద్రపాలనగరం) గ్రామంలోని శ్రీ విద్య రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు మిల్లులోని రికార్డులను పరిశీలించినట్లు తెలిసింది.

2023 సంవత్సరం నుంచి రైస్‌మిల్లు పేరు మార్పు, సీఎంఆర్‌ బియ్యం కేటాయింపులు, మిల్లింగ్‌ వివరాలు, బియ్యం నిల్వలు తదితర అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ వ్యవహారంలో అప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన లావాదేవీలు, సంబంధిత రికార్డులను పరిశీలించడంతో పాటు అధికారుల పాత్రపై కూడా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.సీఎంఆర్‌ బియ్యం పక్కదారి పట్టించారనే ఆరోపణల్లో వాస్తవమెంత? రికార్డుల్లో ఏమైనా అవకతవకలు చోటుచేసుకున్నాయా? అనే అంశాలపై విజిలెన్స్‌ అధికారులు సమగ్రంగా విచారణ చేస్తున్నట్లు సమాచారం. అయితే పూర్తి స్థాయి విచారణ అనంతరం మాత్రమే అసలు విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అధికారికంగా నివేదిక వెలువడిన తర్వాతే ఈ వ్యవహారంపై స్పష్టత రానుంది.

Sthanikam

రైస్‌మిల్లుపై విజిలెన్స్‌ అధికారుల తనిఖీలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News