Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివసాయి వెంచర్‌లో 10 శాతం భూమిని పరిరక్షించాలి పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 12, 2026 02:26 PM

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం: ప్రసవించిన బాలింత అనుమానాస్పద మృతి..

12-08-2026 131 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్లగొండ : నల్లగొండ జిల్లా ప్రభుత్వ సర్వజన వైద్యాశాల (జీజీహెచ్‌) ప్రాంగణంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆసుపత్రిలో ప్రసవించిన ఓ బాలింత అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకొని మృతిచెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామానికి చెందిన మమత (27) ప్రసవం కోసం ఎనిమిది రోజుల క్రితం నల్లగొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చేరింది. కాగా, ఆమెకు ఇప్పటికే ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు. ఇటీవల జరిగిన ప్రసవంలో మమత మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉండటంతో ఆసుపత్రిలోని బాలింతల వార్డులోనే చికిత్స పొందుతున్నారు. అయితే, బుధవారం తెల్లవారుజామున మమత ఎవరికీ చెప్పకుండా వార్డు నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆసుపత్రి ప్రాంగణంలో మార్చురి వద్ద ఉరి వేసుకొని మృతి చెంది నిర్జీవంగా పడి ఉండటాన్ని గమనించిన సిబ్బంది, రోగుల బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు. మమత మృతికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, కుటుంబ సభ్యులతో పాటు ఆసుపత్రి సిబ్బంది, వైద్యులను విచారిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల పూర్తిస్థాయి దర్యాప్తు అనంతరమే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Sthanikam

నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం: ప్రసవించిన బాలింత అనుమానాస్పద మృతి..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News