Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:02 PM

అమావాస్య.. మల్లన్న గుట్టపై ఘనంగా ప్రత్యేక పూజలు.

12-08-2026 111 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: మండలంలోని నిదానపల్లి గ్రామంలో కొలువుదీరిన శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉదయం ఆలయంలో స్వామివారికి విశేష పూజలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

సాయంత్రం మాస కల్యాణోత్సవం.. అనంతరం అన్నప్రసాద వితరణ.

ప్రదోష వేళ అమావాస్య సందర్భంగా ఈరోజు సాయంత్రం 6 గంటలకు మల్లికార్జున స్వామివారి సన్నిధిలో మాస కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు బేతాజీ శశిధర్ దీక్షితులు తెలిపారు. కల్యాణోత్సవం అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు.

ప్రతి అమావాస్య సందర్భంగా స్వామివారి కల్యాణోత్సవాన్ని నిర్వహించడంతో పాటు అన్నదాన కార్యక్రమం చేపడుతున్నామని అర్చకులు తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించి, అన్నప్రసాదాన్ని స్వీకరించి తరించాలని ఆలయ అర్చకులు కోరారు.

Sthanikam

అమావాస్య.. మల్లన్న గుట్టపై ఘనంగా ప్రత్యేక పూజలు.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News