సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని తహసీల్దార్ రవీందర్ రావుకు బుధవారం కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో గల చెరువు కట్ట తెగి నాటు వేసిన పంటపొలాలలో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయారని వారు వాపోయారు, తక్షణమే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు, చెరువు కట్ట మరమ్మత్తులు చేస్తే రాబోయే రోజుల్లో పడే వర్షాలకు నీరు నిలుస్తుందని దాని వల్ల గ్రామస్తులుకు రైతులకు మేలు చేసినట్లు అవుతుందని అన్నారు, తక్షణమే గ్రామ చెరువు సర్వే చేసి కట్ట మరమ్మత్తులు చేయాలని వారు కోరారు వినతి పత్రం అందచేసిన వారిలో సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్, చంద్రా గౌడ్, అబ్బాస్, కళ్యాణ్,రహీమ్,సంతోష్ మరియు గ్రామస్తులు వున్నారు.
తెగిన చెరువు కట్టకు మరమ్మత్తులు చేయించండి...కొండాపూర్ గ్రామస్తులు.

Reporter shekar
సిరికొండ మండలం కొండాపూర్ ఊర చెరువు మరమ్మత్తులు తక్షణమే చేపట్టాలని తహసీల్దార్ రవీందర్ రావుకు బుధవారం కొండాపూర్ సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు.గ్రామంలో గల చెరువు కట్ట తెగి నాటు వేసిన పంటపొలాలలో ఇసుక మేటలు వేసి రైతులు నష్టపోయారని వారు వాపోయారు, తక్షణమే స్పందించి జరిగిన నష్టాన్ని అంచనా వేసి పరిహారం అందించాలని కోరారు, చెరువు కట్ట మరమ్మత్తులు చేస్తే రాబోయే రోజుల్లో పడే వర్షాలకు నీరు నిలుస్తుందని దాని వల్ల గ్రామస్తులుకు రైతులకు మేలు చేసినట్లు అవుతుందని అన్నారు, తక్షణమే గ్రామ చెరువు సర్వే చేసి కట్ట మరమ్మత్తులు చేయాలని వారు కోరారు వినతి పత్రం అందచేసిన వారిలో సర్పంచ్ మానస శ్రీధర్, ఉప సర్పంచ్ రాజేశ్వర్ గౌడ్,గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు జగన్, చంద్రా గౌడ్, అబ్బాస్, కళ్యాణ్,రహీమ్,సంతోష్ మరియు గ్రామస్తులు వున్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి