Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 04:59 PM

కానిస్టేబుల్‌ సాయి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా.

12-08-2026 49 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రూ.22 లక్షల పరిహారం.. తక్షణ సాయంగా రూ.10 లక్షలు.

కుటుంబంలో ఒకరికి ఉద్యోగం.. ఇందిరమ్మ ఇల్లు, తండ్రికి పెన్షన్‌.

ఎల్బీనగర్‌: ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్‌ సాయి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హామీ ఇచ్చారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ వద్ద ఆందోళన చేస్తున్న సాయి కుటుంబసభ్యులు, బంధువులను ఆయన పరామర్శించి భరోసా కల్పించారు.

విధి నిర్వహణలో సాయిని ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని పోలీస్‌ ఉన్నతాధికారులను ఎమ్మెల్యే కోరారు. బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మల్కాజ్‌గిరి సీపీ, డీసీపీతో మాట్లాడి సూచించారు.సాయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వం నుంచి రూ.22 లక్షల పరిహారం, తక్షణ సాయంగా రూ.10 లక్షలు అందేలా చూస్తానన్నారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతోపాటు సాయి తండ్రికి పెన్షన్‌ సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చారు.ఉద్యోగులకు వర్తించే రూ.కోటి బీమా సౌకర్యంపై ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి న్యాయం జరిగేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే, పోలీస్‌ ఉన్నతాధికారుల హామీతో సాయి కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన విరమించారు.

Sthanikam

కానిస్టేబుల్‌ సాయి కుటుంబానికి ఎమ్మెల్యే భరోసా.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News