Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:20 PM

చౌటుప్పల్ పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి: చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌ బుడ్డ సురేష్

12-08-2026 46 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

​గిరిజన తండాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌కు వినతి

చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక గిరిజన యువతీయువకులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్‌కు చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌, కౌన్సిలర్ బుడ్డ సురేష్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని దిల్ కుషా అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలు, వివిధ వార్డులతో పాటు మారుమూల గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని కమిషన్ సభ్యులను కోరారు. అలాగే, స్థానికంగా ఉన్న కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను సైతం గిరిజన ప్రాంతాల మౌలిక వసతుల కల్పనకు వెచ్చించేలా యాజమాన్యాలకు, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Sthanikam

చౌటుప్పల్ పరిశ్రమల్లో గిరిజన యువతకు ఉపాధి కల్పించాలి: చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌ బుడ్డ సురేష్

Article Image

​గిరిజన తండాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు కేటాయించాలి

జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోతు హుస్సేన్ నాయక్‌కు వినతి

చౌటుప్పల్ మండల పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక గిరిజన యువతీయువకులకు తగిన ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ ఎస్టీ కమీషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్‌కు చౌటుప్పల్ మున్సిపాలిటీ భాజపా ఫ్లోర్ లీడర్‌, కౌన్సిలర్ బుడ్డ సురేష్ వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని దిల్ కుషా అతిథి గృహంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గిరిజన కాలనీలు, వివిధ వార్డులతో పాటు మారుమూల గిరిజన తండాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా చూడాలని కమిషన్ సభ్యులను కోరారు. అలాగే, స్థానికంగా ఉన్న కంపెనీల సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులను సైతం గిరిజన ప్రాంతాల మౌలిక వసతుల కల్పనకు వెచ్చించేలా యాజమాన్యాలకు, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఆయన, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News