Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:05 PM

బునాదిగాని కాలువపై ప్రభుత్వానివి ఒట్టి మాటలే. కాలువ పూర్తయ్యే వరకు పోరాటం ఆపేది లేదు: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్.

12-08-2026 21 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: బునాదిగాని (ధర్మారం) కాలువ నిర్మాణం విషయంలో పాలకులు గత రెండు దశాబ్దాలుగా రైతాంగాన్ని మోసం చేస్తూనే ఉన్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్ విమర్శించారు. కాలువ పూర్తయ్యే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

బుధవారం భువనగిరిలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం భువనగిరి మండల కమిటీ సమావేశం జిల్లా కమిటీ సభ్యుడు దయ్యాల నర్సింహ అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జహంగీర్ మాట్లాడుతూ.. 2005లో బీబీనగర్ మండలం మక్త అనంతారంలో శంకుస్థాపన చేసిన బునాదిగాని కాలువ 20 ఏళ్లు గడిచినా పూర్తికాలేదన్నారు. 98 కిలోమీటర్ల కాలువకు ఇప్పటివరకు కేవలం 25 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయని తెలిపారు.

కాలువ నిర్మాణానికి కోట్లాది రూపాయలు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా, పూర్తిస్థాయిలో నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని ఆరోపించారు. కాలువ నిర్మాణానికి సుమారు 750 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 250 ఎకరాలు మాత్రమే సేకరించారని తెలిపారు. కాలువపై నిర్మించాల్సిన 100 కల్వర్టుల్లో కేవలం 15 మాత్రమే పూర్తయ్యాయని పేర్కొన్నారు.

2024–25లో రూ.225 కోట్లు మంజూరు చేసినట్లు ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు పూర్తిస్థాయి నిధులు విడుదల చేయలేదని జహంగీర్ విమర్శించారు. భూసేకరణలో రెవెన్యూ, నీటిపారుదల శాఖల అధికారుల వైఖరి ఉదాసీనంగా ఉందని, భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం చెల్లించడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు.

ప్రభుత్వం తక్షణమే తగిన నిధులు విడుదల చేసి కాలువ పనులను వేగవంతం చేయాలని, భూసేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, భూములు కోల్పోతున్న రైతులకు ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఈ డిమాండ్ల సాధన కోసం ఈ నెల 29, 30, 31 తేదీల్లో భువనగిరి నుంచి హైదరాబాద్ వరకు పాదయాత్ర, 31న హైదరాబాద్‌లో మహా ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు, వృత్తిదారులు, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సమావేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు అన్నంపట్ల కృష్ణ, కొండ అశోక్, మండల కమిటీ సభ్యులు బొల్లెపల్లి లీల, మోటె ఎల్లయ్య, కొండపురం యాదగిరి, కళ్లెం లక్ష్మీనరసయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బునాదిగాని కాలువపై ప్రభుత్వానివి ఒట్టి మాటలే. కాలువ పూర్తయ్యే వరకు పోరాటం ఆపేది లేదు: సీపీఎం జిల్లా కార్యదర్శి ఎం.డి. జహంగీర్.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News