Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కార్యకర్త కుమార్తె MBBS చదువుకు ఎమ్మెల్యే ఆర్థిక భరోసా. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:03 PM

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. రంగనాథన్ సేవలు చిరస్మరణీయం.

12-08-2026 67 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భారత గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్‌.ఆర్‌. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కళాశాల గ్రంథాలయ విభాగం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రిన్సిపాల్‌ ఆచార్య రాహత్‌ ఖాన్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో గ్రంథాలయాల స్థాపన, అభివృద్ధి కోసం రంగనాథన్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గ్రంథపాలకులు డాక్టర్‌ రాచమళ్ళ శ్రీను మాట్లాడుతూ.. లండన్‌ విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్రాన్ని అభ్యసించిన రంగనాథన్‌ భారత్‌కు తిరిగి వచ్చి గ్రంథాలయ శాస్త్ర అభివృద్ధికి విశేష కృషి చేశారని తెలిపారు. ఆయన సేవలు చిరస్మరణీయమన్నారు.

కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ ఆచార్య ఆర్‌. రత్నమంజుల, అకడమిక్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ డి. కిషన్‌, ఐక్యూఏసీ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎన్‌. లక్ష్మీనీలిమ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు. రంగనాథన్ సేవలు చిరస్మరణీయం.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News