Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వీధి దీపాలు వెలగక 12వ వార్డులో అంధకారం మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 10:53 PM

ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న కానిస్టేబుల్ షకీల్...

22-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం నల్లగొండ టూ టౌన్ కానిస్టేబుల్ షకీల్‌కు ఉత్తమ అవార్డు...

నల్లగొండ : జిల్లాలో మాదకద్రవ్యాల కట్టడికి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, డ్రగ్స్ మాఫియా నడుము విరిచిన నల్లగొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ మొహమ్మద్ షకీల్ ఉత్తమ ప్రతిభ పురస్కారాన్ని అందుకున్నారు. ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా, విక్రయాలు, వినియోగంపై నిరంతరం నిఘా ఉంచుతూ పలు కీలక కేసుల చేధనలో ఆయన చురుగ్గా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఈగల్ (EAGLE - అంటీ నార్కోటిక్స్ బ్యూరో) ఏడీజీ సందీప్ శాండిల్య చేతుల మీదుగా కానిస్టేబుల్ షకీల్ ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించారు. యువతను మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడటంలో, జిల్లా వ్యాప్తంగా గంజాయి తదితర మత్తు పదార్థాల రవాణాను అరికట్టడంలో నల్లగొండ పోలీసులు చూపుతున్న చొరవ అభినందనీయమని ఈ సందర్భంగా ఏడీజీ ప్రశంసించారు. కానిస్టేబుల్ షకీల్‌కు ఉత్తమ అవార్డు దక్కడంపై నల్లగొండ టూ టౌన్ సీఐ ఆదిరెడ్డి, ఎస్సై డి. సైదాబాబు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తెచ్చారని కొనియాడారు. షకీల్‌కు అవార్డు రావడం పట్ల టూ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

ఉత్తమ ప్రతిభ పురస్కారం అందుకున్న కానిస్టేబుల్ షకీల్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News