Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రియాక్టర్ పేలుడుతో ఎజోలో ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 22, 2026 08:08 AM

రియాక్టర్ పేలుడుతో ఎజోలో ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం

22-08-2026 111 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ఇద్దరి పరిస్థితి విషమం.. పది మంది కార్మికులకు గాయాలు.

యాదాద్రి భువనగిరి జిల్లా: భూదాన్ పోచంపల్లి మండలం దోతీగూడెం గ్రామంలోని ఎజోలో ఫార్మా కంపెనీలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీలోని రియాక్టర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ప్రమాద తీవ్రతకు పరిసర ప్రాంతాలు దద్దరిల్లాయి.

రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీలో పనిచేస్తున్న పది మంది కార్మికులు గాయపడగా, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను పోలీసులు, సిబ్బంది హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. భారీగా మంటలు ఎగిసిపడుతుండటంతో పరిసర ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది.

పేలుడు శబ్దంతో ఉలిక్కిపడిన గ్రామాలు

రియాక్టర్ పేలిన సమయంలో భారీ శబ్దం రావడంతో దోతీగూడెం, అంతమ్మగూడెం గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏం జరిగిందో తెలియక గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. అధికారులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

Sthanikam

రియాక్టర్ పేలుడుతో ఎజోలో ఫార్మాలో భారీ అగ్నిప్రమాదం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News