Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:24 AM

మున్నూరు కాపు విద్యార్థుల భవిష్యత్తుకు బాసట.. వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ

21-08-2026 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

నల్లగొండలో ఘనంగా ప్రారంభమైన నిర్మాణ పనులు.. నిధుల సమీకరణకు సహకరిస్తాం: నేతి విద్యాసాగర్, పూల రవీందర్

నల్లగొండ పట్టణంలో మున్నూరు కాపు విద్యార్థుల కోసం నిర్మించనున్న విద్యార్థి వసతిగృహానికి శుక్రవారం భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఎన్‌ఎన్‌ఆర్‌ఎస్ గార్డెన్స్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతిగృహ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి నేతృత్వంలో ఏర్పాటు చేశారు. శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతి విద్యాసాగర్, పూల రవీందర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి నల్లగొండ పట్టణానికి చదువుకునేందుకు వచ్చే మున్నూరు కాపు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో వసతిగృహ నిర్మాణానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు మెరుగైన వసతి కల్పించడంతోపాటు చదువుకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడం ద్వారా వారి భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని అన్నారు.

వసతిగృహ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల సమీకరణలో తమ వంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. నల్లగొండ జిల్లాలోని మున్నూరు కాపు కుల బంధువులు, సంఘాల నాయకులు, దాతలు ఈ నిర్మాణ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సమాజంలోని ప్రతి ఒక్కరి సహకారంతో వసతిగృహ నిర్మాణాన్ని విజయవంతంగా పూర్తి చేయవచ్చని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, దాతల నుంచి కూడా నిధులు సమీకరించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేపడుతున్న ఈ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ట్రస్ట్ బోర్డు అధ్యక్షుడు నేతి రఘుపతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నత విద్య కోసం నల్లగొండకు వచ్చే విద్యార్థులకు సరసమైన, సౌకర్యవంతమైన వసతి అందించడమే ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. వసతిగృహ నిర్మాణాన్ని దశలవారీగా పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షుడు కాటం సునీల్, ఉపాధ్యక్షుడు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు కంచనపల్లి జవహర్‌లాల్, పీఎంకేజేఎఫ్ ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు తూడి జనార్దన్ పటేల్, నాగులంచ స్వామి, ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవుల వెంకట నరసయ్య, శేషనాల రఘువీర్, వొలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు, కేసిడి వెంకట నరసయ్య, నాగులపల్లి శ్యాంసుందర్, జువాజీ ఇంద్రయ్య, కంచి సత్యనారాయణ, పందిరి వేణు, వీడియో జర్నలిస్ట్ చేపూరి రవి, సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వరమూర్తి, సుధాకర్, వసంతరావు, పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జురి గిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్నూరు కాపు విద్యార్థుల భవిష్యత్తుకు బాసట.. వసతిగృహ నిర్మాణానికి భూమిపూజ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News