Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:09 PM

ఈవీ ఆటోల నిర్ణయాన్ని విరమించుకోవాలి

ఈవీ ఆటోల నిర్ణయాన్ని విరమించుకోవాలి

ఈవీ ఆటోల నిర్ణయాన్ని విరమించుకోవాలి
21-08-2026 44 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఆర్టీసీకి ఈవీ ఆటోలను అందించే రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను విరమించుకునేలా మద్దతు పలకాలని బీఆర్‌టీయూ ఆటో యూనియన్ నాయకులు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డిని కోరారు. శుక్రవారం జగదీష్‌రెడ్డిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 24న రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆటోల బంద్ పోస్టర్‌ను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. ఆర్టీసీకి ఈవీ ఆటోలు అందించడం వల్ల ఆటోలపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉచిత బస్సు ప్రయాణం కారణంగా ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రజా రవాణా కోసం ఈవీ ఆటోలను తీసుకురావడం సముచితమే అయినప్పటికీ, ఇప్పటికే ఆటో ముడి సరుకుల ధరలు పెరగడంతో కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

ఈ నెల 24న నిర్వహించే రాష్ట్రవ్యాప్త ఆటోల బంద్‌కు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు ఇవ్వాలని వారు కోరారు.

బీఆర్‌టీయూ ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు కుర్రి సైదులు, ప్రధాన కార్యదర్శి ఎస్.కే. అహ్మద్, పట్టణ అధ్యక్షుడు ఖుషి వెంకన్న, జిల్లా ఉపాధ్యక్షుడు గుండె వెంకన్న, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగయ్య, మట్టయ్య, రాపర్తి రాజు, ఎన్. వెంకన్న, రుద్ర నర్సింహ, బాబా, బొడ్డు సురేష్, కర్ణాకర్, మల్లేష్, అనాజిపురం అడ్డా యూసఫ్, మాంగళ్య అడ్డా వెంకన్న, శంకర్, డీమార్ట్ వెంకన్న, రాజకుమార్, సుందరయ్యనగర్ నరేష్, ఆనంద్, పోస్టాఫీస్ వీరయ్య, రాజీవ్‌నగర్ అడ్డా అధ్యక్షుడు సొందుమియా, నాని, బైపాస్ శీను, మల్లేష్, వేణుతో పాటు పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Sthanikam

ఈవీ ఆటోల నిర్ణయాన్ని విరమించుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News