సదాశివపేటలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల అధ్యక్షులు నిజాంపూర్ అశోక్, కార్యదర్శి తంగడిపల్లి లక్ష్మణ్, సాయిరాం షాపింగ్ మాల్ యజమాని ప్రకాష్, ప్రముఖ వ్యాపారవేత్త గోవింద్ సోమనీ, జర్నలిస్టు ఉల్లిగడ్డల అనిత శివకుమార్ దంపతులు పాల్గొని దీప ప్రజ్వలన చేశారు. 14వ వార్డు కౌన్సిలర్ ఉల్లిగడ్డల ఉమారాణి–నాగరాజు దంపతులు ప్రధాన పీఠంపై కూర్చొని వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 56 మంది పోషకులు, మరో 150 మంది మాతాజీలు, భక్తులు, విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాలలో ఎన్నో సంవత్సరాలుగా సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహిస్తున్నామని కవిత రవీందర్ రాందాస్ తెలిపారు. మనం చేసే ప్రతి పనిని భక్తిశ్రద్ధలతో చేయాలని, పిల్లలను దైవస్వరూపంగా భావించాలని సూచించారు. అనంతరం నిర్వహించిన లక్కీడ్రాలో ఐదుగురు మహిళలకు చీరలను బహుమతిగా అందజేశారు. శిల్ప, అర్చిత, లావణ్య, అంజమ్మ, సుమలత బహుమతులు అందుకున్నారు. పాఠశాల ప్రధానాచార్యులు తమ్మలి సంగమేశ్వర్ మాట్లాడుతూ వ్రతంలో పాల్గొన్న ప్రతి కుటుంబానికి సుఖసంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనధాన్యాలు, సంతానాభివృద్ధి కలగాలని ఆకాంక్షించారు.
సదాశివపేటలో ఘనంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి