Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శ్రీ ​గాయత్రి కళాశాలలో కన్నులపండువగా బతుకమ్మ సంబరాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:43 AM

టీచర్లకు ఏఐ శిక్షణ.. డిజిటల్ నైపుణ్యాలపై ఫోకస్

20-08-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్, ఆగస్టు 20:

మారుతున్న విద్యా రంగానికి అనుగుణంగా ఉపాధ్యాయులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని డా.బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. ఏఐ వినియోగంతో బోధన, అభ్యసన ప్రక్రియ మరింత సమర్థవంతంగా మారుతుందన్నారు. ‘ఉపాధ్యాయులకు కృత్రిమ మేధస్సు’ అంశంపై 15 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం వర్సిటీలో ప్రారంభించారు.

అన్ని స్కూళ్లలో డిజిటల్‌ ల్యాబ్‌లు

రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో త్వరలో ఐసీటీ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్, డైరెక్టర్ డా. నవీన్ నికోలస్, ఐఏఎస్ తెలిపారు. పాఠ్య ప్రణాళిక, డిజిటల్ కంటెంట్ తయారీ, మూల్యాంకనం తదితరాల్లో ఏఐ సాధనాలు ఉపాధ్యాయులకు ఉపయోగపడతాయన్నారు. ప్రధానోపాధ్యాయులకు పాఠశాల పరిపాలనపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు.

1,509 మంది టీచర్లకు శిక్షణ

ఏఐని బాధ్యతాయుతంగా, సమర్థంగా వినియోగించేలా ఉపాధ్యాయులను తీర్చిదిద్దడమే శిక్షణ లక్ష్యమని COEL డైరెక్టర్ ప్రొ. జి. పుష్ప చక్రపాణి తెలిపారు. బోధన, డిజిటల్ కంటెంట్ అభివృద్ధి, మూల్యాంకనం, విద్యార్థులకు సహాయం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 1,509 మంది ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డా. ఎల్. విజయ్ కృష్ణారెడ్డి, ఓపెన్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ హరి, శిక్షకులు, యూనివర్సిటీ అధ్యాపకులు పాల్గొన్నారు.

Sthanikam

టీచర్లకు ఏఐ శిక్షణ.. డిజిటల్ నైపుణ్యాలపై ఫోకస్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News