Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:11 PM

అంకిరెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

20-08-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఆరుతడి పంటల వైపే మొగ్గు చూపాలి: ఏఈఓ వీణ

భూమిని బీడు ఉంచితే పథకాలు వర్తించవు: సర్పంచ్ మల్లేష్ గౌడ్

వరి పంటకు బదులుగా ఆరుతడి పంటలు సాగు చేయడం ద్వారా రైతులు సత్వర లాభాలు పొందవచ్చని లింగోజిగూడెం వ్యవసాయ విస్తరణాధికారి (ఏఈఓ) వీణ తెలిపారు. చౌటుప్పల్ మండలం అంకిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ అధ్యక్షతన గురువారం ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ​ఈ సందర్భంగా ఏఈఓ వీణ మాట్లాడుతూ, ఎల్ నినో పరిస్థితుల వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. ఇలాంటి సమయంలో వరి వేస్తే దిగుబడి తగ్గి నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా కంది, పెసర, మినుము, బొబ్బర్లు, శనగలు, ఉలువలు, కూరగాయల పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు. సర్పంచ్ సుర్వి మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, ప్రతి రైతు తమ భూమిని ఖాళీగా ఉంచకుండా తప్పనిసరిగా ఏదో ఒక పంటను సాగు చేయాలన్నారు. భూమిని బీడుగా ఉంచితే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత కోల్పోతారని స్పష్టం చేశారు.

​ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు కాకులారం మల్లారెడ్డి, దొడ్ల సెట్టయ్య, పర్ని రామచంద్రరెడ్డి, ఇటికాల నర్సిరెడ్డి, భీమగోని బాలరాజ్, మోడెపు నరసింహ, పెంటయ్య, జంగయ్య, ముద్దం సెట్టయ్య, వెంకటేశం, శ్రీను ముత్యాలు, సుర్వి లచ్చయ్య, రాములు, దాసు, గంగిరెడ్డి అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, భూపాల్ రెడ్డి, ఇమ్మడి ఏసుదాస్, ఇరగదిండ్ల ఈద్దయ్య, కే యాదిరెడ్డి, కే జంగారెడ్డి తదితర రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Sthanikam

అంకిరెడ్డిగూడెంలో ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News