Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:12 PM

చౌటుప్పల్‌లో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు స్థలం కేటాయించాలి

20-08-2026 136 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

పాలకవర్గ సాధారణ సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం

చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల కాంప్లెక్స్ నిర్మాణాన్ని చేపడుతున్నందున, మార్కెట్ యార్డ్ కోసం కనీసం 10 ఎకరాల అనువైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది. చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో కమిటీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య అధ్యక్షతన పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ.. రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే నూతన మార్కెట్ యార్డ్ నిర్మాణం అత్యంత అవసరమని పేర్కొన్నారు. కనీసం 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని వెంటనే మార్కెట్ యార్డ్‌కు కేటాయించాలని తీర్మానం ప్రవేశపెట్టగా, పాలకవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ​ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, వెలిమినేడు పిఎసీఎస్ చైర్మన్ రఘుమారెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి సారంగపాని, మార్కెట్ కమిటీ కార్యదర్శి రవీందర్ రెడ్డి,​ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బోయ వెంకటేష్, కరంటోతు శంకర్ నాయక్, డిల్లి చంద్రకళ, మహమ్మద్ గౌస్ ఖాన్, చిమ్మల వెంకట్ రెడ్డి, పబ్బు శ్రీకాంత్ గౌడ్, మర్రి రాజి రెడ్డి, సుర్వి వెంకటేష్ గౌడ్, దాచేపల్లి విజయ్ కుమార్, గజ్జెల కృష్ణ మూర్తి, మార్కెట్ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చౌటుప్పల్‌లో నూతన వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు స్థలం కేటాయించాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News