Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 10:12 AM

సైబర్‌ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష! నాగోల్ పోలీసుల అవగాహన కార్యక్రమం

20-08-2026 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

: సైబర్‌ నేరగాళ్ల మాయలో పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మల్కాజిగిరి సైబర్‌ క్రైమ్‌ డీసీపీ నాగలక్ష్మి సూచించారు. సైబర్‌ జాగరూకత దివస్‌ సందర్భంగా నాగోల్‌ పోలీస్‌ స్టేషన్‌లో సుమారు 60 మంది సీనియర్‌ సిటిజన్లకు సైబర్‌ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిటల్‌ అరెస్ట్‌ మోసాలు, పెట్టుబడుల పేరుతో మోసాలు, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరుతో మోసాలు, ఓఎల్‌ఎక్స్‌, ఆన్‌లైన్‌ షాపింగ్‌, కస్టమర్‌ కేర్‌, రుణాలు, మ్యాట్రిమోనియల్‌ మోసాలు తదితర సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించారు. టిజైన్‌ కేసులు, ఆన్‌లైన్‌ భద్రత, సోషల్‌ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓటీపీ–యూపీఐ మోసాలు, ఫిషింగ్‌ వంటి అంశాలను వివరించారు.

ఓటీపీ, బ్యాంకు ఖాతా వివరాలు, యూపీఐ పిన్‌ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు వెల్లడించవద్దని పోలీసులు సూచించారు. అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయకుండా, ఆన్‌లైన్‌ లావాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

కార్యక్రమంలో ఏసీపీ శివశంకర్‌ గౌడ్‌, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ మహమ్మద్‌ మక్బూల్‌ జానీ, ఎస్‌ఐలు పి.శివ నాగ ప్రసాద్‌, మమతారెడ్డి పాల్గొన్నారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Sthanikam

సైబర్‌ మోసాలపై అప్రమత్తతే శ్రీరామరక్ష! నాగోల్ పోలీసుల అవగాహన కార్యక్రమం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News