Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తరగతి గదిలో గురువులు.. ఉద్యోగంలో మాత్రం అతిథులే! రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 20, 2026 09:22 AM

రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు

20-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఎస్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు ‘అరైవ్ – అలైవ్’ నినాదంతో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనల పాటింపు, హెల్మెట్ ధరించడం, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, విద్యార్థుల భవిష్యత్తుపై వాటి ప్రభావం గురించి వివరించారు. పరిసర ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. సమాచారం అందించే వారి వివరాలను గోప్యంగా ఉంచి, అక్రమ మాదకద్రవ్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.విద్యార్థినుల భద్రత కోసం షీ టీం ‘పోలీస్ అక్క’ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, వేధింపులు లేదా ఇతర సమస్యలు ఎదురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి మాట్లాడుతూ..విద్యార్థుల భద్రత పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచి, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోదాడ టౌన్ ఎస్సై ఉపేందర్ రెడ్డి, కోదాడ టౌన్ ఎస్సై మల్సూర్, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి, పోలీస్ సిబ్బంది, కళాశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

రోడ్డు భద్రత, మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన సదస్సు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News