Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అర్హులకే మంజూరు చేయాలి కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 06:03 PM

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు పోరాటం

19-08-2026 3 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బుల్లెట్ ట్రైన్ సాధన సమితి పోరాటానికి బీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు

సూర్యాపేట జిల్లా కేంద్రానికి బుల్లెట్ ట్రైన్ సాధించేందుకు బుల్లెట్ ట్రైన్ సాధన సమితి చేపట్టే ప్రతి కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ పూర్తి మద్దతు ఉంటుందని మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆరో రోజు నిరాహార దీక్షలకు కూర్చున్న ఆర్యవైశ్యులకు బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి వారు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లా కేంద్రానికి రైల్వే మార్గం వస్తే ఈ ప్రాంతం పారిశ్రామికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తొలుత బుల్లెట్ ట్రైన్‌ కేటాయింపును సూర్యాపేటకు ప్రతిపాదించి, అనంతరం మార్గాన్ని మార్చడం ఏమిటని ప్రశ్నించారు.

కేంద్ర మంత్రులు జోక్యం చేసుకుని రైల్వే శాఖ మంత్రితో చర్చించి, సూర్యాపేట జిల్లా కేంద్రానికి 65వ జాతీయ రహదారికి సమాంతరంగా బుల్లెట్ ట్రైన్ మార్గాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేటను రైల్వే కారిడార్‌గా అభివృద్ధి చేయాలని కోరారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తరహాలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి ఉద్యమం కొనసాగుతోందని, ఎప్పటికైనా సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించి తీరుతామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి కూడా బుల్లెట్ ట్రైన్ సాధన సమితి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తారని తెలిపారు. బుల్లెట్ ట్రైన్ సాధన కోసం ఆయన తనవంతు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

సాధన సమితి ఎలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినా తాము ముందుండి పాల్గొంటామని తెలిపారు. సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించుకునేందుకు ప్రజలంతా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకులు ఉప్పల ఆనంద్, మాజీ జెడ్పీటీసీ జీడి భిక్షం, ఆర్యవైశ్యులు బండారు రాజా, కర్నాటి కిషన్, తోట శ్యాంప్రసాద్, కలకోట లక్ష్మయ్య, వెంపటి పురుషోత్తం, పోతుగంటి వెంకటేశ్వర్లు, వెంపటి సురేష్, తప్సి గాంధీ, ఈగ దయాకర్, గుండా రమేష్, ఈగ వెంకటేశ్వర్లు, వెంపటి శబరినాథ్, బచ్చు పురుషోత్తం, షీలా శంకర్, చల్లా సత్యనారాయణ, కర్నాటి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

సూర్యాపేటకు బుల్లెట్ ట్రైన్ సాధించే వరకు పోరాటం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News