Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 09:18 PM

స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసుపై స్పందించిన మహిళా కమిషన్...

18-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసుపై స్పందించిన మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరణ.. ఎస్పీకి ఆదేశాలు

(నల్గొండ): నాగార్జున పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపాల్, డైరెక్టర్ కుల్లు రూపా రెడ్డి దారుణ హత్య ఘటనను తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ కేపాన్ని సుమోటోగా స్వీకరించినట్లు కమిషన్ చైర్‌పర్సన్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జేబీ కాలనీలోని స్వగృహంలో రూపా రెడ్డి హత్యకు గురై వారం రోజులు గడుస్తున్నా నిందితులను ఇంకా గుర్తించకపోవడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఘటన తీవ్రతను బట్టి కేసు విచారణకు ఆదేశించామని, నిందితులను వెంటనే అరెస్టు చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని నల్గొండ జిల్లా ఎస్పీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. మహిళలపై జరిగే ఇటువంటి తీవ్ర నేరాలపై పోలీసులు అత్యంత ప్రాధాన్యతతో స్పందించాలని, బాధితురాలి కుటుంబానికి తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని చైర్‌పర్సన్ స్పష్టం చేశారు. ఈ కేసు దర్యాప్తు పురోగతిని మహిళా కమిషన్ నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.

Sthanikam

స్కూల్ ప్రిన్సిపాల్ హత్య కేసుపై స్పందించిన మహిళా కమిషన్...

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News